: తీహార్ జైల్లో మహిళా ఖైదీల కోసం ఇ-లైబ్రరీ


మహిళా ఖైదీల్లో మార్పు కోసం తీహార్ జైల్లో కొత్తగా ఇ-లైబ్రరీ ప్రారంభించారు. మహిళా ఖైదీలు చదవడం, నేర్చుకోవడమే కాకుండా, కంప్యూటర్ ను ఉపయోగించడమూ తెలుసుకుంటారని తీహార్ జైలు డీఐజీ ముఖేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 5-6 కంప్యూటర్లు, రెండు ట్యాబ్లెట్ పీసీలు ఉండే ఈ లైబ్రరీని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీకి చెందిన 'ఇండియా విజన్' ఎన్జీవో సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. ఇందుకు జీఎస్4 అనే భద్రత సంస్థ కూడా తోడ్పాటునందించింది. కాగా, ఇ-లైబ్రరీని డైరక్టర్ జనరల్ (ఢిల్లీ జైళ్ళు) అలోక్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ బేడీ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News