: జూడాలపై 'ఎస్మా' ప్రయోగించేందుకు టి. సర్కారు సిద్ధంగా ఉంది: డీఎంఈ


గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసుల విషయంలో జూనియర్ డాక్టర్లు పట్టుబట్టడం సరికాదని, వారు అలాగే వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించేందుకు వెనుకాడబోదని డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) స్పష్టం చేసింది. జూడాలపై కఠిన చర్యలకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉందని డీఎంఈ తెలిపింది. నిబంధనల ప్రకారం జూనియర్ డాక్టర్లు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సిందేనని తేల్చి చెప్పింది. సమ్మెల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని డీఎంఈ జూడాలపై మండిపడింది. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వెంటనే విధుల్లో చేరాలని సూచించింది.

  • Loading...

More Telugu News