: ఈ నెల 26న హర్యానా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం


హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయిన మనోహర్ లాల్ కత్తార్ ఈ నెల 26న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు తనను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్న అనంతరం కత్తార్ మాట్లాడుతూ, పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకత్వం ద్వారా ఈ బాధ్యత (సీఎం పదవికి)కు ఎన్నికకాబడినానని చెప్పారు. ఇక నుంచి హర్యానా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక పారదర్శకతతో కూడిన ప్రభుత్వాన్ని అందిస్తానన్నారు. ఏ ప్రాంతం మీదా ఎటువంటి వివక్షా ఉండదని చెప్పారు.

  • Loading...

More Telugu News