: ఆళ్లగడ్డ పోటీకి కాంగ్రెస్ దూరం... అఖిల ప్రియ ఎన్నిక లాంఛనమే
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ ఎన్నిక ఇక లాంఛనమే. ఉప ఎన్నికలో పోటీకి తాము దూరంగా ఉంటామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ మేరకు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పారు. పాత సంప్రదాయాలకు కట్టుబడి... తాము ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు దూరంగా ఉంటామని నిన్ననే టీడీపీ ప్రకటించింది. శాసనసభ్యులు మృతి చెంది.. పోటీలో వారి కుటుంబసభ్యులే నిలబడితే ఇతర పార్టీలు పోటీ చేయకూడదన్న సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాన పార్టీలన్నీ పోటీ నుంచి తప్పుకోవడంతో, అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది.