: రైతులు, మహిళల కోసం చివరివరకూ కృషి చేస్తాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుదిశ్వాస ఉన్నంతవరకూ రైతులు, మహిళల కోసం కృషి చేస్తామని చెప్పారు. గన్నవరంలో రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు బ్యాంకులకు వడ్డీ కట్టవద్దని చెప్పారు. అందుకు ఎంత వడ్డీ అయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయిందని... దాంతో పెట్టుబడి కూడా పెరిగిందని బాబు పేర్కొన్నారు.