: మోడీపై విచారణ జరపలేం: అమెరికా


2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో భారత ప్రధాని మోడీపై విచారణ జరపలేమని అమెరికా ప్రభుత్వ న్యాయవాది ప్రీత్ బరారా స్పష్టం చేశారు. గుజరాత్ అల్లర్లపై 'అమెరికన్ జస్టిస్ సెంటర్' అనే స్వచ్ఛంద సంస్థ వేసిన కేసు నిన్న కోర్టులో విచారణకు వచ్చింది. ఓ దేశానికి నేతృత్వం వహిస్తున్న అధినేతగా మోడీకి అమెరికా కోర్టుల నుంచి మినహాయింపు లభిస్తుందని... మోడీపై విచారణ జరపకూడదని అమెరికా ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా బరారా తెలిపారు. అయితే అమెరికన్ జస్టిస్ సెంటర్ తరపున వాదిస్తున్న న్యాయవాది దీనిపై అభ్యంతరం తెలిపారు. అమెరికా చట్టాలకు, మానవ హక్కులకు ఇది వ్యతిరేకమని... దీనిపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News