: విమాన ప్రమాదంలో ఫ్రెంచ్ చమురు దిగ్గజ కంపెనీ సీఈవో మృతి


ఫ్రెంచ్ చమురు దిగ్గజ కంపెనీ 'టోటల్' సీఈవో క్రిస్టోఫీ డి మార్గెరి (63) విమాన ప్రమాదంలో మరణించారు. మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ పోర్టు అధికార ప్రతినిథి వెల్లడించారు. "గతరాత్రి మంచును తొలగించే యంత్రాన్ని ఢీకొట్టడంతో విమానం కూలిపోయింది. ముగ్గురు సిబ్బంది సహా ఓ ప్రయాణికుడు చనిపోయారు. మరణించిన ఆ వ్యక్తి టోటల్ సంస్థ అధిపతి మార్గెరి అని నిర్ధారిస్తున్నా" అని తెలిపారు. అటు సీఈవో మరణాన్ని టోటల్ కంపెనీ కూడా ధృవీకరించింది.

  • Loading...

More Telugu News