: సూర్యదేవుని దర్శించుకున్న జగన్
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లిలోని సూర్యనారాయణ స్వామి వారిని వైకాపా అధినేత జగన్ దర్శించుకున్నారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. గత 8 రోజుల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.