: భారతీయ సినీ చరిత్రలో ‘దిల్వాలే...’ సరికొత్త రికార్డు!


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో 19 ఏళ్ల పాటు ప్రదర్శితమై 20వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. 1995, అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ ఆ థియేటర్ లో రోజూ ఉదయం ఆటగా ప్రదర్శితమవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు. నాడు ప్రేమ జంటలను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రానికి నేటికీ ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమా కోసం పెద్ద సంఖ్యలో యువత మరాఠా మందిర్ కు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో థియేటర్ పూర్తి స్థాయిలో నిండిపోతోందట.

  • Loading...

More Telugu News