: మొత్తం... మీరే చేశారు!: హుడాపై కుమారి షెల్జా ఆగ్రహం


మొత్తం... మీరే చేశారు! ఇది 'బొమ్మరిల్లు' సినిమాలో హీరో సిద్ధార్థ డైలాగు. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుమారి షెల్జా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై అంతెత్తున మండిపడ్డారు. హర్యానాలో పార్టీని మూడో స్థానానికి దిగజార్చిన హుడాపై ఆమె ఆవేదన నిజమేనన్నట్లు... మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా షెల్జా వ్యాఖ్యలపై నోరువిప్పలేదు. "భారత్ లో హర్యానా నెంబర్.1 అన్నారు. మరి రాష్ట్రంలో పార్టీ మూడో స్థానానికి ఎందుకు దిగజారింది. అంటే ఊరికెనే ఊకదంపుడు నినాదాలు చేశారన్న మాటేగా? అసలు మీ నినాదం ప్రజల దరికే చేరలేదు. రాష్ట్రంలో పార్టీ దుస్థితికి మీరే కారణం" అంటూ హుడాపై షెల్జా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పార్టీ ఘోర పరాజయానికి హుడా ఒక్కరే కారణమా? సోనియా అల్లుడి భూదాహం పాత్ర ఏమీ లేదా? అంటూ రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News