: కేసీఆర్ వైఖరిపై మండిపడ్డ హోంగార్డులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆ రాష్ట్ర హోంగార్డులు మండిపడుతున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో తమ గురించి కనీసం ఒక్కమాటైనా కేసీఆర్ మాట్లాడలేదని వారు వాపోతున్నారు. తమ అభివృద్ధి కోసం ఎన్నో చేస్తానని గతంలో ప్రకటించిన కేసీఆర్... వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో హోంగార్డుల సమస్యలను లేవనెత్తలేదని నిరసన వ్యక్తం చేశారు. తమకు వెంటనే జీతాలు పెంచాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు.