: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమేనా?
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక ఏకగ్రీవం దిశగా సాగుతోంది. వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి మృతి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 8న జరగనున్న ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. అయితే ఇప్పటిదాకా వైకాపా అభ్యర్థి, శోభానాగిరెడ్డి పెద్ద కూతురు అఖిల ప్రియ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. బరిలో నిలవాలని మొన్నటిదాకా భావించిన టీడీపీ, చివరకు పోటీకి దూరంగానే ఉండాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే భావనతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి.