: చేతిలో అధికారం ఉంచుకుని, కరెంట్ పై నన్ను తిడితే ఉపయోగమేంటి?: చంద్రబాబు


మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఆ నియోజక వర్గ కార్యకర్తలతో చంద్రబాబు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు ఆయన చేశారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మి గెలిపించారని, చేతిలో అధికారం ఉంచుకుని కూడా సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించకుండా... తనపై నెపం నెడుతూ తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో ఇబ్బందులు వచ్చాయని...దానికి కేంద్రాన్నో, పక్క రాష్ట్రాల్నో నిందించే ప్రయత్నం తాను చేయలేదని ఆయన అన్నారు. ఏపీకు ఉన్న అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విజభన జరిగిన తర్వాత ఏపీకు ఆర్థిక లోటు, తెలంగాణకు కరెంట్ కష్టాలు ఉంటాయని తాను ముందు నుంచి చెబుతూ వస్తున్నానని ఆయన అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ముందుచూపుతో వెళ్లాలని, ఏపీ ముఖ్యమంత్రిగా తాను అదే చేస్తున్నానన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి, తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ సమస్య ఉండేదని... దానిని చాలెంజ్ గా తీసుకుని 2004 నాటికి తెలంగాణలో మిగులు కరెంట్ తెచ్చానని ఆయన అన్నారు. హుదూద్ తుపానుకు ఉత్తరాంధ్రలో 30 వేల విద్యుత్ స్తంభాలు, ఐదు వేల ట్రాన్స్ ఫార్మర్లు, కొన్ని వేల చెట్లు పడిపోయాయని ఆయన అన్నారు. రెండు, మూడు నెలల వరకు కరెంట్ సరఫరా అసాధ్యమని అధికారులు అంటే, తాను దానిని చాలెంజ్ గా తీసుకుని వారం రోజుల్లో కరెంట్ తెచ్చి చూపించానని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News