: బాణాసంచా పేలుడు ఘటనలో 16కు చేరిన మృతులు!
తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో సోమవారం చోటుచేసుకున్న పేలుడులో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. సోమవారం బాణాసంచా తయారీలో జరిగిన పేలుడులో అక్కడికక్కడే 12 మంది చనిపోగా, ఆ ఘటనలో తీవ్ర గాయాలపాలై, అపోలో అస్పత్రిలో చేరిన వారిలో నేటి ఉదయం మరో నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 16 కు పెరిగింది. చనిపోయిన వారిలో 15 మంది మహిళలే. ఇదిలా ఉంటే, పేలుడు జరిగిన ప్రాంతానికి కూలీ పని నిమిత్తం వచ్చిన మరో ఇద్దరు మహిళల ఆచూకీ లభించడం లేదు. దీంతో వీరు కూడా ప్రమాదం బారిన పడ్డారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.