: రాజధాని పోలీస్ కంట్రోల్ రూం ప్రారంభం నేడే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా అభివృద్ధి చెందనున్న విజయవాడలో ‘రాజధాని పోలీస్ కంట్రోల్ రూం’ ఏర్పాటు కానుంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు విజయవాడలో పర్యటిస్తున్న సందర్భంగా రాజధాని పోలీస్ కంట్రోల్ రూంను ప్రారంభించనున్నారు. అంతేకాక కొత్తగా ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ కొత్త విధానంతో వివిధ కేసులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకు ప్రజలకు మరింత వెసులుబాటు లభించనుందని చంద్రబాబు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.