: ఇక దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ దృష్టి!
కాంగ్రెస్ కంచుకోటలు మహారాష్ట్ర, హర్యానాల్లో ఆ పార్టీని చావుదెబ్బ కొట్టిన బీజేపీ, తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించే దిశగా అడుగులేస్తోంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ప్రజల్లో ఉన్న నమ్మకం బహిర్గతమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజల్లోనూ తమ పార్టీ వైపు మొగ్గు చూపే వారి శాతం మెరుగ్గానే ఉందని వారు భావిస్తున్నారు. ‘తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా దక్షిణాదిపై పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగుతాం. రాష్ట్రాల విషయానికొస్తే, తమిళనాడును కీలకంగా పరిగణిస్తున్నాం. పార్టీ దక్షిణాది కార్యకలాపాలకు తమిళనాడే కేంద్ర బిందువు’ అని పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు చెప్పారు.