: అమేథీ మహిళలకు స్మృతి ఇరానీ చీరలు!


కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, అమేథీ ప్రజలకు చీరలను పంపిణీ చేశారు. తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన 15,000 చీరలను ఆమె అమేథీ లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మహిళలకు అందించారు. తద్వారా ఎన్నికల్లో ఓడినా, అమేథీని మరిచిపోయేది లేదని ఆమె స్పష్టం చేశారు. చీరల ప్యాక్ పై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇరానీ ఫొటో కూడా వుంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీలో పోటీ చేసిన ఇరానీ ఓటమిపాలయ్యారు. అయితే, ఓటమి చెందినా, అమేథీ అభివృద్ధిపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె దీపావళిని పురస్కరించుకుని మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. ఇదిలా ఉంటే, ఓ రాజకీయ వేత్త నుంచి ఇప్పటిదాకా ఇలాంటి బహుమతులు తీసుకోలేదని అమేథీ జనం అంటున్నారు. అంతేకాక తాము ఎదుర్కొంటున్న విద్యుత్, రోడ్ల సమస్యలను ఇరానీ పరిష్కరిస్తారన్న నమ్మకం కలుగుతోందని కూడా చెప్పారు.

  • Loading...

More Telugu News