: నవంబర్ 5న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు: జగన్
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు, వంచనకు వ్యతిరేకంగా నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైకాపా అధినేత జగన్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతులు, డ్వాక్రా మహిళలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రైతు రుణమాఫీని చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు చేయలేదని ఆయన మండిపడ్డారు. రైతులు రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. రైతులకు కనీసం క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.