: కార్పొరేట్ సంస్థలకు గ్రామాలను దత్తతకిస్తాం: చంద్రబాబు


హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో కొన్ని కాలనీలను పునర్నిర్మిస్తామని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. కార్పొరేట్ సంస్థలకు కొన్ని ప్రాంతాలను దత్తతకు ఇస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విశాఖ రూపు రేఖలను మారుస్తామని, డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News