: షర్మిలా ఠాగోర్, సైఫ్ అలీఖాన్ లకు ఈసీ నోటీసులు


బాలీవుడ్ ప్రముఖ నటి షర్మిలా ఠాగోర్, ఆమె కుమారుడు, నటుడు సైఫ్ అలీఖాన్ లకు ఎన్నికల కమిషన్ నోటీసులు పంపింది. సైఫ్, కరీనాల ద్వితీయ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గుర్గావ్ సమీపంలోని పటౌడీ ప్యాలెస్ లో ఈ నెల 16న గ్రాండుగా పార్టీ ఏర్పాటు చేశారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైన ఆ పార్టీ రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు జరిగింది. అయితే, పెద్దగా మ్యూజిక్ ప్లే చేసి, లౌడ్ స్పీకర్లు పెట్టి నిబంధనలు అతిక్రమించారంటూ ఈసీ నోటీసులు పంపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. "ఎన్నికల పర్యవేక్షకుడు అజయ్ శంకర్ పాండే ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకుగానూ నోటీసు పంపాం. సెలబ్రేషన్స్ లో ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు ఉపయోగించారని పటౌడీ ప్రాంత రిటర్నింగ్ ఆఫీసర్ ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతేగాక కాక్ టెయిల్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు" అని ఆర్ఎస్ సంగ్వాన్ అధికార ప్రతినిధి చెప్పాడు.

  • Loading...

More Telugu News