: వెన్నెముక బలానికి రెడ్ వైన్ సాయం!


పురుషుల్లో వెన్నెముక సాంద్రత పెరిగేందుకు రెడ్ వైన్ సాయపడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. అమెరికాలోని అర్హాస్ యూనివర్శిటీ హస్పిటల్ కు చెందిన పరిశోధకులు ఈ విషయమై అధ్యయనం చేపట్టారు. ద్రాక్షలో ఉండే రిస్వెరాట్రోల్ అనే సహజ సమ్మేళనం ఎలుకల ఎముకల్లో క్షయాన్ని నివారించడంలో విశేషమైన పనితీరు కనబరచడాన్ని పరిశోధకులు గుర్తించారు. ద్రాక్షతో తయారయ్యే రెడ్ వైన్ లో రిస్వెరాట్రోల్ ఉంటుంది. కాగా, మనుషుల్లో కనిపించే ఆస్టియోపొరోసిస్ వ్యాధిని నయం చేయగల శక్తి రిస్వెరాట్రోల్ కు ఉందన్న విషయం తమ అధ్యయనం ద్వారానే వెల్లడైందని, ఈ సమ్మేళన పదార్థం ఎముక సంబంధిత కణాలను ఉత్తేజితం చేస్తుందన్న విషయాన్ని తమ అధ్యయనం సూచిస్తోందని పరిశోధకురాలు మేరీ జూల్ ఓర్న్ స్ట్రప్ వివరించారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే రిస్వెరాట్రోల్ ను అధిక మోతాదులో ఇవ్వడం ద్వారా వెన్నెముక సాంద్రతలో గణనీయమైన పురోగతి కనిపించిందని తెలిపారు. ప్రస్తుతం వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి ఆస్టియోపొరోసిస్ కాగా, దీర్ఘకాలం సాగే ఈ వ్యాధి చికిత్సలో ఎముకలు దెబ్బతినే అవకాశం ఉంది. కాగా, ఈ చికిత్సలో ఎముకలు దెబ్బతినకుండా రక్షించేందుకు ఉపయోగపడే రీతిలో తాము అదనపు పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఓర్న్ స్ట్రప్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News