: మహారాష్ట్ర ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన తెలుగు తేజం


మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుతేజం ద్వారంపూడి మల్లికార్జునరామిరెడ్డి చరిత్రకెక్కారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామానికి చెందిన మల్లికార్జునరామిరెడ్డి రామ్ టెక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. కాంట్రాక్టర్ అయిన రామిరెడ్డి... రామ్ టెక్ ప్రాంతంలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. ప్రజాసేవ ద్వారా అక్కడి ప్రజలతో రామిరెడ్డి మమేకమయిపోయారు. దీంతో, ఎన్నికల్లో పోటీచేసిన ఆయనకు ఓటర్లు నీరాజనం పలికారు.

  • Loading...

More Telugu News