: ఆళ్లగడ్డలో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయం


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఈ రోజు చంద్రబాబుతో కర్నూలు జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, ఆళ్లగడ్డలో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తామని కర్నూలు జిల్లా నేతలు చంద్రబాబుకు తెలిపినప్పటికీ... పోటీకి ఆయన సుముఖత చూపలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాని, ఎంపీ కాని చనిపోయినప్పుడు... ఆ స్థానంలో వారి కుటుంబీకులు పోటీ చేస్తే... ఇతర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకుండా చూడటం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో, కొన్ని సందర్భాల్లో పాత సంప్రదాయాలు పాటించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సర్ది చెప్పారు.

  • Loading...

More Telugu News