: అత్యధిక కలెక్షన్లు రాబట్టిన విదేశీ చిత్రంగా 'ధూమ్ 3'
బాలీవుడ్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీసు వద్దేకాక విదేశాల్లోనూ భారీగానే వసూళ్లు రాబడుతున్నాయి. తాజాగా 2013లో రిలీజ్ అయి రూ.500 కోట్లు రాబట్టిన 'ధూమ్3' ఆస్ట్రేలియాలోనూ భారీ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. దాంతో, అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా రికార్డులకెక్కింది. అందులోనూ ఈ ఘనత సాధించిన తొలి చిత్రం 'ధూమ్ 3' కావడం విశేషం. ఈ మేరకు క్వీన్ లాండులో జరిగిన '69వ ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మూవీ కన్వెన్షన్'లో అవార్డు పొందింది. దాన్ని ఈ సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ 'మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్స్' స్వీకరించింది.