: మంత్రివర్గ సహచరులకు నేడు మోడీ విందు


ప్రధాని నరేంద్ర మోడీ, తన మంత్రివర్గ సహచరులకు నేడు విందు ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేస్తున్న ఈ విందులో కేబినెట్ లోని మొత్తం 44 మంది మంత్రులు హాజరు కానున్నారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా మోడీ ఇస్తున్న ఈ విందు ప్రాధాన్యం సంతరించుకుంది. పలు కీలక అంశాలపై తన మంత్రులతో మనసు విప్పి చర్చించేందుకే మోడీ ఈ విందును ఏర్పాటు చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం అనుసరించాల్సిన విధివిధానాలపై భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ విందులో మంత్రులతో మోడీ చర్చించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News