: ఐసీసీ ర్యాకింగ్స్ లో మనవాళ్ళు పైపైకి


విండీస్ తో సిరీస్ లో రాణించిన టీమిండియా క్రికెటర్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తమ స్థానాలు మెరుగుపరుచుకున్నారు. ధర్మశాల వన్డేలో సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండోస్థానానికి ఎగబాకాడు. కెప్టెన్ ధోనీ ఎప్పట్లానే ఆరోస్థానంలో కొనసాగుతుండగా, ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ స్థానం పతనమై ఎనిమిదో ర్యాంకుకు పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా యోధుడు ఏబీ డివిల్లీర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలిసారి టాప్-10లోకి దూసుకువచ్చాడు. విండీస్ తో సిరీస్ లో రెండే వికెట్లు తీసినా, అంతకుముందు ఇంగ్లండ్ తో సిరీస్ లో మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో భువీకి ఏడో ర్యాంకు లభించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ర్యాంకుల్లో ఓ స్థానం పతనమై ఆరో ర్యాంకులో నిలిచాడు. సస్పెన్షన్ కు గురైన సయీద్ అజ్మల్ ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నా ఐసీసీ దాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News