: మోడీ విజ్ఞప్తికి ఓకే చెప్పిన పీటీ ఉష


భారత్ లో ఎందరో మహిళా అథ్లెట్లకు ఆదర్శంగా నిలిచిన మేటి స్ప్రింటర్ గా పీటీ ఉష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె ఓ దీర్ఘకాలిక లక్ష్యంతో శిక్షణ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఒలింపిక్స్ లో భారత మహిళా స్ప్రింటర్లు సత్తా చాటాలన్నదే ఆమె స్వప్నం. అందుకోసం మెరికల్లాంటి అథ్లెట్లను ఎంపిక చేసి, వారిని సానబడుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ అథ్లెట్లకు ఒలింపిక్స్ దిశగా శిక్షణ ఇవ్వాలంటూ పీటీ ఉషకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఉష సమ్మతి తెలిపారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోడీ గుజరాత్ అథ్లెట్లకు శిక్షణ ఇవ్వాలని కోరారని, వడోదరలో ఉన్న శిక్షణ సదుపాయాలు బాగున్నాయని, దీన్నో సవాల్ లా స్వీకరిస్తున్నానని ఉష మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News