: ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టిన జర్నలిస్టులు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో టీవీ 9, ఏబీఎన్ ఛానెళ్ల జర్నలిస్టులు దీక్ష చేపట్టారు. నాలుగు నెలలుగా టీవీ 9, ఏబీఎన్ ఛానెళ్లను నిషేధించడంపై వారు ఆందోళన ప్రారంభించారు. జర్నలిస్టుల ఆందోళనకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. మీడియాకు సంకెళ్లా? మీడియాకు గొంతు నివ్వండి, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు అర్థమిదా? అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. టీవీ ఛానెళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News