: ఫేస్ బుక్ వారిని గెలిపించిందా?
సామాజిక అనుసంధాన నెట్ వర్క్ లు ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తున్నాయి. యువ రాజకీయ నాయకులు ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా నిరంతర అప్ డేట్స్, చర్చలు, అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా ప్రజాదరణ సంపాదించుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఫేస్ బుక్ పేజీకి 8, 92,000 లైక్స్ ఉన్నాయి. మరో యువనేత పంకజ్ ముండేకి 3 లక్షలకు పైగా లైక్స్ ఉన్నాయి. ఇంకో నేత వినోద్ తవడే ఫేస్ బుక్ లో 8,48,000 లైక్స్ తో దూసుకుపోతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కెప్టెన్ అభిమన్యు సింధుకు 2,07,776 లైక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వీరంతా ఫేస్ బుక్ వల్లే విజయం సాధించారని పలువురు విశ్లేషిస్తున్నారు. సామాజిక అనుసంధాన నెట్ వర్క్ ను వేదికగా చేసుకుని ప్రచారం సాగించి సులువుగా విజయం కైవసం చేసుకున్నారని ఫేస్ బుక్ లో పలు కామెంట్లు దర్శనమిస్తున్నాయి. ఈ లెక్కన భవిష్యత్ లో అభ్యర్థులు సామాజిక నెట్ వర్క్ లోనే ఎక్కువగా ప్రచారం చేస్తారేమో చూడాలి.