: రైలులో మంటలు... బెంబేలెత్తిన ప్రయాణికులు
పాట్నా నుంచి బెంగుళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ప్యాంట్రీకార్ కింద భాగంలో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ట్రైన్ ను వరంగల్ లో నిలిపేశారు. మరమ్మతుల అనంతరం ట్రైన్ తిరిగి బయల్దేరనుంది.