: మహారాష్ట్ర, హర్యానాల్లో చారిత్రాత్మక ఫలితాలు సాధించాం: మోడీ


మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆ రెండు రాష్ట్రాల్లో చారిత్రాత్మక ఫలితాలు సాధించామని అన్నారు. ఫలితాలు బీజేపీకి సంతోషం కలిగించాయని పేర్కొన్నారు. కార్యకర్తల శ్రమఫలితమే ఈ విజయాలని అన్నారు. మహారాష్ట్రలో 24 ఏళ్ళ తర్వాత 100కు పైచిలుకు సీట్లు నెగ్గిన పార్టీగా బీజేపీ అవతరించింది. 1990లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 144 సీట్లు రాగా, ఆ తర్వాత మరే పార్టీ 'సెంచరీ' మార్కు దాటలేదు.

  • Loading...

More Telugu News