: వారం రోజుల తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు


హుదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన విశాఖలో వారం రోజుల పాటు గడిపిన సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం హైదరాబాదు బయల్దేరారు. ఈ వారం రోజులు బాబు తుపాను సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపారు. సహాయచర్యలు త్వరితగతిన సాగేలా ఆయా శాఖలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News