: బధిరుల కోసం సూపర్ యాప్
కొందరికి పుట్టుకతోనే చెముడు ప్రాప్తిస్తుంది. మరికొందరు వివిధ ప్రభావాల కారణంగా ఈ లోపంతో బాధపడుతుంటారు. అలాంటి బధిరుల కోసం ఓ అద్భుతమైన యాప్ ను అభివృద్ధి చేశారు. దీనిపేరు 'ట్రాన్సెన్స్'. ఈ యాప్ ద్వారా మాటలు పదాలుగా మారి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. తద్వారా ఎదుటి వ్యక్తులు చెప్పిన విషయాన్ని బధిరులు సులభంగా గ్రహించడానికి వీలవుతుంది. బర్క్ లీ, శాన్ ఫ్రాన్సిస్కో వర్శిటీల కు చెందిన నలుగురు విద్యార్థులు ఈ యాప్ ను రూపొందించారు. ఓ బధిరుడు తన మిత్రుల సమూహంలో ఉన్నప్పుడు, ప్రతి గొంతును గుర్తించే విధంగా ఈ యాప్ డిజైన్ చేశారు. ఒక్కో గొంతుకు ఒక్కో రంగులో అక్షరాలు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. తద్వారా, ఆ మాటలను తన మిత్రుల్లో ఎవరు మాట్లాడారన్న విషయాన్ని బధిరుడు తెలుసుకోగలుగుతాడు.