: రెండు రాష్ట్రాల్లో ప్రజలదే విజయం... మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలదే విజయమని అన్నారు. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్, తాజాగా, రెండు రాష్ట్రాల్లో మూడోస్థానానికి పరిమితమైందని అన్నారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అన్న తమ ప్రచారం ఫలించిందని అమిత్ షా చెప్పుకొచ్చారు.