: బీజేపీకి బయటి నుంచి మద్దతిచ్చేందుకు ఎన్సీపీ సిద్ధం
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట్టయితే బయటనుంచి మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్సీపీ పేర్కొంది. ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని భావిస్తున్నామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు.