: బాలకృష్ణ నిజజీవితంలో డాక్టర్లా సేవలు చేస్తున్నారు: తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాజయ్య హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆసుపత్రి కోసం నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవలను అభినందించారు. సినిమాల్లో డాక్టర్ పాత్రలు తక్కువగానే చేసిన బాలకృష్ణ నిజజీవితంలో మాత్రం డాక్టర్లా సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన ఓ ఆశయం కోసం పనిచేస్తున్నారని, క్యాన్సర్ రహిత రాష్ట్రం కోసం పాటుపడుతున్నారని రాజయ్య కితాబిచ్చారు.