: అభివృద్ధికి, నీతికి ప్రజలు పట్టం కట్టారు: జవదేకర్
ఎవరైతే మంచి పాలనను అందిస్తారో వారికే ప్రజలు పట్టం కడతారన్న విషయం ఈ రోజు వెలువడుతున్న ఫలితాలతో మరోసారి వెల్లడవుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అభివృద్ధికి, నీతికే సామాన్యులు ఓటు వేశారని తెలిపారు. అధికారంలోకి వస్తామని కలలు గన్న మిగతా పార్టీలన్నీ... ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని చెప్పారు. మోడీ నాయకత్వంపై దేశంలోని ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.