: ఐఎస్ఐఎస్ పై పోరుకు ఇరాక్ బలగాలకు శిక్షణ ఇవ్వనున్న స్పెయిన్


ఇరాక్, సిరియాల్లో రక్తపాతం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పోరాడేందుకు అవసరమైన శిక్షణను ఇరాక్ బలగాలకు స్పెయిన్ ఇవ్వనుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ శిక్షణా కార్యక్రమం మొదలవుతుందని స్పెయిన్ రక్షణశాఖ మంత్రి పెడ్రో మోరెనెస్ వెల్లడించారు. ఫ్లోరిడాలో ఉన్న యూఎస్ సెంట్రల్ కమాండ్ ను నిన్న ఆయన సందర్శించారు. అంతేకాకుండా ఐఎస్ఐఎస్ మిలిటెంట్లపై చేపట్టాల్సిన మిలిటరీ ఆపరేషన్లపై యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ చక్ హాగెల్ తో చర్చించారు. అయితే, తాము ఇరాక్ బలగాలకు కేవలం శిక్షణ మాత్రమే ఇస్తామని... డైరెక్ట్ గా యుద్ధరంగంలోకి దిగమని మోరెనెస్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News