: బెర్ముడా దీవులను తాకిన హరికేన్ 'గొంజాలొ'
అట్లాంటిక్ సముద్రంలో ఉన్న బెర్ముడా దీవులను 'గొంజాలొ' హరికేన్ కుదిపేసింది. హరికేన్ ప్రభావంతో 110 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. హరికేన్ ధాటికి దీవుల్లోని ప్రజానీకం బెంబేలెత్తిపోయింది. పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భారీ వృక్షాలు నేలకూలాయి. 10 అడుగుల ఎత్తు వరకు అలలు లేస్తున్నాయి.