: రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన నవయుగ కన్ స్ట్రక్షన్స్
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు విరాళాలను ప్రకటించాయి. ఈ క్రమంలో నవయుగ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ కూడా చేయూతను అందించడానికి సన్నద్ధమైంది. రూ. 5 కోట్లను సీఎం సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది.