: ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఏపీ ప్రభుత్వ విధివిధానాలు జారీ
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. వాటి వివరాలు... * ఆర్టికల్ 371(డి) ప్రకారమే స్థానికతను నిర్ధారిస్తారు. * వరుసగా నాలుగేళ్లపాటు ఎక్కడ చదివితే అక్కడి స్థానికతనే గుర్తిస్తారు. దీని ప్రకారం... ఆంధ్రలో స్థానికత ఉన్న తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో స్థానికత ఉన్న ఆంధ్ర విద్యార్థులకు బోధనా రుసుమును చెల్లిస్తారు. * విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆధార్ నంబర్ తప్పని సరిగా ఉండాలి.