: 21న కోర్టుకు హాజరు కాలేను: జగన్ పిటిషన్
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్ ఈ నెల 21న నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను 21న కోర్టుకు హాజరు కాలేనని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తుపాను బాధిత ప్రాంతాల్లో తాను పర్యటిస్తున్నానని... అందువల్ల కోర్టుకు హాజరు కాలేనని పిటిషన్ లో పేర్కొన్నారు. తన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు.