: నివాసానికి చేరుకున్న జయ... ఘన స్వాగతం
బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదలైన ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో ఆమె నివాసం వద్దకు చేరుకున్న ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు, బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న జయకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి తన నివాసం వరకు దారి పొడవునా... కార్యకర్తలు, అభిమానులు మానవహారం చేపట్టారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా రోడ్లపై వేచి ఉన్నారు. నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ తమ హర్షాతిరేకం వెలిబుచ్చారు.