: సహాయక చర్యల్లో బిజీబిజీగా బాలకృష్ణ
విశాఖలోని తుపాను బాధిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. అంతేకాకుండా, స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్లను రంపంతో కోశారు. ప్రొక్లెయినర్ ను స్వయంగా నడుపుతూ రోడ్డు పునరుద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికితోడు, తుపాను బాధితులతో మాట్లాడుతూ, వారిలో విశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా, బాలకృష్ణ వెంట ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు కూడా ఉన్నారు.