: తుపాను బాధితులకు ఆర్టీసీ కార్మికులు రూ.2 కోట్ల విరాళం
హుదుద్ తుపాను బాధితులకు ఆర్టీసీ కార్మికులు భారీ విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ ఒకరోజు మూలవేతనం రూ.2 కోట్లను ఏపీ సీఎం సహాయ నిధికి ఇవ్వాలని కార్మికులు నిర్ణయించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగతా పది జిల్లాల ఆర్టీసీ కార్మికులు ఈ విరాళాన్ని ఇస్తున్నారు.