: జిల్లాకో గ్యాంగ్ లీడర్... టీడీపీ ప్రణాళిక: వాసిరెడ్డి పద్మ
జిల్లాకో గ్యాంగ్ లీడర్ ను తయారు చేయడయే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ఆమె విమర్శించారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని శనివారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఆరోపించారు. ఎన్నికల అనంతరం తమ పార్టీకి చెందిన 16 మందిని టీడీపీ నేతలు పొట్టనబెట్టుకున్నారన్నారు. టీడీపీ ఫ్యాక్షనిజానికి ఆ పార్టీకి చెందిన నేతలే భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మంత్రి పరిటాల సునీత, ఆమె కొడుకు శ్రీరామ్, యువసేన పేరిట దౌర్జన్యాాలకు దిగుతున్నారన్నారు. పరిటాల సునీత, శ్రీరామ్ ల గూండాగిరిపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పద్మ ప్రస్తావించారు.