: పదేళ్లలో నదుల అనుసంధానం పూర్తి చేస్తాం: ఉమా భారతి
దేశంలో నదుల అనుసంధానాన్ని ఏడు నుంచి పదేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. తాము చేపట్టనున్న ఈ బృహత్కార్యంలో దేశంలోని 30 నదులు ఒకదానితో మరొకటి అనుసంధానం కానున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు పాల్గొన్న నదుల అనుసంధాన కమిటీ భేటీ సందర్భంగా ఆమె ఈ మేరకు ప్రకటించారు. దేశంలోని జల వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు వచ్చే నెల రెండో వారంలో ‘జల మంథన్’ పేరిట మెగా సదస్సును నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.