: హరీష్ రావుగారూ! శ్రీశైలం విద్యుత్ ఆపేస్తున్నాం: దేవినేని ఉమ ఫోన్
ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఫోన్ చేశారు. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి నిలిపేస్తున్నామని తెలిపారు. రాయలసీమ వాసుల నీటి అవసరాలు తీర్చేందుకు సరిపడా నిల్వలు లేనందున, విద్యుద్ ఉత్పాదన చేయలేమని ఆయన చేతులెత్తేశారు. ప్రజల తాగు నీరు అవసరాలు తీర్చిన తరువాతే ఇతర సౌకర్యాల కల్పన అని ఆయన స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో విద్యుత్ లోటు మరింత పెరగనుంది.