: రోడ్డు ప్రమాదంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ మాజీ అధ్యక్షుడి మృతి


నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమీ జాతీయ మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ అహ్మద్ (45) నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ నల్గొండలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వస్తూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటీన అతనిని సాయి సంజీవని ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News