: గన్ కాదు కానీ ఆటకట్టిస్తుంది
మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్తే క్షేమంగా ఇళ్లు చేరుతారన్న గ్యారెంటీ ఉండడం లేదు. ఆకతాయిలు, ఈవ్ టీజర్లు, రేపిస్టులు ఎప్పుడు మహిళలు ఒంటరిగా చిక్కుతారా అని చూస్తూ ఉంటారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది? అనే ప్రశ్నలకు 'కోబ్రాన్యూస్.కామ్' సంస్థ పరిష్కారం చూపిస్తామంటోంది. మహిళల హ్యండ్ బ్యాగుల్లో ఇమిడిపోయే వస్తువులను తయారు చేస్తోంది. చూసేందుకు ఆటవస్తువుల్లా అనిపించే వీటితో ప్రత్యర్థులకు ప్రమాదమే కానీ మహిళలకు రక్షణ దొరుకుతుంది. 'షాకింగ్ గన్' చూసేందుకు బొమ్మ తుపాకీలా ఉంటుంది. ఎవరైనా ఎగస్ట్రాలు చేస్తే అలాంటివారిని గురి చూసి ఆన్ చేస్తే చాలు దుండగుడు స్పృహ కోల్పోవడం ఖాయం. అలాగే ఈ సంస్థ తయారు చేసిన 'షాకింగ్ టార్చ్' లైట్ కూడా 'షాకింగ్ గన్' మాదిరిగానే పని చేస్తుంది. దీనిని ఎవరి ముఖంమీదైనా ప్రసరించేలా చేస్తే వాళ్లు స్పృహ కోల్పోతారని తయారీదారులు చెబుతున్నారు.